నాగార్జునసాగర్ ఎడమ కాల్వ రైతులకు మంత్రుల
అభయం ఉగాది నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.2వేల కోట్లతోఆర్‌అండ్‌బి పనులు
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ వెల్లడి
మన తెలంగాణ/పాలకవీడు: శ్రీశైలం ప్రాజె క్టు నుండి విద్యుత్ తయారు చేసి ఐదు టిఎంసిల నీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తరలిం చి ఎడమ కాలువ ద్వారా ఏఎంఆర్‌పి ద్వారా పంట చేతికివ చ్చే వరకూ సాగునీరు అందిస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. చివరి ఆయకట్టు వరకు నీరందిస్తా మని స్పష్టం చేశారు. ఆదివారం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి సూర్యాపేట జిల్లా, జాన్‌పహాడ్ దర్గా వద్ద నిర్వహించిన కా ర్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనల అనంతరం డెక్కన్ సిమెంట్ పరిశ్రమ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డుదారులకు 6 కిలోల సన్నబియ్యం అందజేస్తామని వెల్లడించారు. ఉగాది నుండి రాష్ట్ర ప్రభుత్వం రా ష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యా న్ని ఉచితంగా ఆరు కిలోలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్‌నగర్ పట్టణంలో ఉగాది రోజు న ప్రారంభమవుతుందని తెలిపారు. ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యత గల సన్నబియ్యం అందజేస్తామన్నారు.
ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.200 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లను నిర్మిస్తున్నామని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దొడ్డు రకం బియ్యాన్ని ఇవ్వటం వలన వాటిని ప్రజలు తినకుండా కోళ్లఫారాలకు, బీర్ల కంపెనీలకు రీసైక్లింగ్ ద్వారా కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా తరలించి దుర్వినియోగపరిచారని ఆరోపించారు. అందుకే ప్రజల కోసం ప్రతి ఒక్కరూ సన్నబియ్యం తినేలా తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత చట్టాన్ని పటిష్ట పరుస్తూ తెలంగాణలోని 3.2 కోట్ల మందికి (84 శాతం ) ఉగాది నాడు ప్రారంభించి ఏప్రిల్ నెల నుండి ప్రతి ఒక్కరికీ ఆరు కేజీల సన్న బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకి ప్రాధాన్యతనిస్తూ అనుకున్న సకాలంలో పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు.
ఎస్‌ఎల్‌బిసి నుండి డిండి ప్రాజెక్టు. నెల్లికళ్ళు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ మరమ్మతులు, ఏఎంఆర్ మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. ఇటీవలే గంధ మల్లకు కేబినెట్ ఆమోదం పొందామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కృష్ణానది నీటి కొరత కారణం గత ప్రభుత్వమేనని, 512 టిఎంసిలు ఆంధ్రకిచ్చి 299 టిఎంసిలకి మాత్రమే తెలంగాణకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. అలాగే పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచిన మచ్చికల్లు వద్ద డబుల్ నీళ్లను ఆంధ్రవారు తరలించేందుకు గత ప్రభుత్వం సహాయం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కృష్ణానది బోర్డు మేనేజ్మెంట్ తో మాట్లాడి, తెలంగాణ వాటాని పెంచే విధంగా పోరాడుతున్నామని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.2000 కోట్లతో పలు రోడ్లు నిర్మించి ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో నెంబర్వన్‌గా ఉంచుతామని వివరించారు.
ఎస్‌ఎల్‌బిసి సొరంగంను గతంలో వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించి 30 కిలోమీటర్లు పూర్తి చేశామని, తదుపరి వచ్చిన ప్రభుత్వం పదేళ్లు కాళేశ్వరం పేరుతో కాలయాపన చేసి మిగిలిన ప్రాజెక్టులను వదిలేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రాగానే ఎస్ ఎల్‌బిసి సొరంగ నిర్మాణం పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లి రాబిస్ కంపెనీతో చర్చించి పనులు ప్రారంభించామని, కానీ పనుల్లో సొరంగం కూలడం దురదృష్టకరమని అన్నరారు. బ్రాహ్మణ వెల్ల్లంలకి రూ.200 కోట్ల రూపాయలు పదేళ్లు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచారని, తాము రాగానే పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని తెలిపారు. సోమవారం ఎస్ ఎల్‌బిసి పనులపై ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపి రఘువీర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎంఎల్‌ఎలు పద్మావతి రెడ్డి , బి లక్ష్మారెడ్డి, జై వీర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బాలు నాయక్, అనిల్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మదర్ డైరీ ఛైర్మన్ కొత్త అమిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు తదితరులు పాల్గొన్నారు.