Wednesday, January 22, 2025

కెసిఆర్ బర్త్ డే….. పంట పొలాలకు నీరు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా మానసపుత్రిక సాగునీటి కల రైతులకు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. రంగనాయక ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతుల కు యాసంగి పంటకు నీళ్లు ఇవ్వనున్న హరీష్ రావు పేర్కొన్నారు.  తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసి..సబ్బండ వర్గాల సమన్యాయం పరిపాలన అందిస్తున్న పరిపాలన దక్షడు మహానాయకుడు మన సిఎం కెసిఆర్ జన్మదినోత్సం సందర్భంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట రైతులకు యాసంగి పంటకు రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు అందించే గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సంధర్భంగా రైతులకు శుభవార్త చెపుతూ కెసిఆర్ బర్త్ డే గిఫ్ట్ గా చెరువులకు, కుంటలకు పంట పొలాలకు సాగునీళ్లు ఇవ్వనున్నామన్నారు. సిద్దిపేట అంటే కరువు పీడిత ప్రాంతం అని ఒకప్పటి మాట అని, సిద్దిపేట గోదావరి జలాలు సిద్దిపేట ప్రజలకు అందించాలని కెసిఆర్ కల నిజమై ఈ ప్రాంతాన్ని కల్పతరవు నేడు మన కళ్ళ ముందు సాకారం చేసిన గొప్ప నాయకుడు మన కెసిఆర్ అని హరీష్ రావు ప్రశంసించారు. ఈ సందర్భంగా రైతు పంట పొలాలకు సాగు నీరు ఇవ్వాలనే సంకల్పం తో మంత్రి హరీష్ రావు రైతులకు తీపి కబురు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News