Wednesday, January 22, 2025

చీమలపాడు బాధితుడికి ఐఆర్‌ఎస్ అధికారి పరామర్శ

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : చీమలపాడు ఘటనలో కాలు కోల్పోయి ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారేపల్లి మండల ఓ పత్రిక విలేఖరి అంగోత్ రవికుమార్‌ను బుధవారం తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ టాక్స్ కమిషనర్ (ఐఆర్‌ఎస్ అధికారి) లావుడ్యా జీవన్ లాల్ పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. రెండు నెలల క్రితం చీమలపాడులో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వార్త కవరేజ్ కోసం వెళ్లిన కారేపల్లి మండల రిపోర్టర్ ఆంగోత్ రవికుమార్ అక్కడ జరిగిన గ్యాస్ పేలుడు సంఘటనలో ఒక కాలును కోల్పోయి. మరొక కాలుకు బలమైన గాయం కావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు.

గత రెండు నెల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవికుమార్‌ను ఐఆర్‌ఎస్ అధికారి జీవన్ లాల్ పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. అరవికుమార్‌ను పరామర్శించిన వారిలో ఐఆర్‌ఎస్ అధికారి జీవన్ లాల్ తో పాటు కారేపల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూక్య రంగారావు, ఆసుపత్రి సూపర్డెంట్ బి.వెంకటేశ్వర్లు, లైవ్ జిల్లా ఇంచార్జి బాలునాయక్, బిఆర్‌ఎస్ నాయకులు అజ్మీరా వీరన్న, అడప పుల్లారావు, గౌస్ పాషా, జూపల్లి రాము,చందర్ తదితరులు ఉన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News