Monday, January 20, 2025

ఇడి యాక్టింగ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తాత్కాలిక (యాక్టింగ్ ) డైరెక్టరుగా రాహుల్ నవీన్ నియమితులు అయ్యారు. ఇడి ప్రస్తుత డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం ఈ నెల 15న ముగిసింది. దీనితో ఇప్పుడు ఐఆర్‌ఎస్ అధికారి అయిన రాహుల్ నవీన్‌ను ఇడి యాక్టింగ్ డైరెక్టర్‌గా భారత రాష్ట్రపతి నియమించిందని తెలియచేస్తున్నట్లు శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. పూర్తి స్థాయి కొత్త డైరెక్టర్ నియామకం ప్రక్రియ పూర్తయ్యే వరకూ రాహుల్ నవీన్ ఈ బాధ్యతల్లో ఉంటారని ప్రకటనలో తెలిపారు. సంజయ్ మిశ్రా పదవీ కాలాన్ని నెలరోజులుఅయినా పొడిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతిని కేంద్రం కోరింది. అయితే ఈ అవకాశం కల్పించడం కుదరని చెప్పడంతో ఇప్పుడు సంజయ్ స్థానంలో ఇడి పదవిలోకి రాహుల్ నవీన్ వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News