హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ దాటి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లీస్‌ఈఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) పరిశీలిస్తోంది. తమ పొత్తుదారులతో సంప్రదించాకే తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ సీట్లకు పోటీ చేయాలన్నది నిర్ణయిస్తామని ముస్లిమీన్ పార్టీ నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
ఇటీవల ఆదిలాబాద్‌లో ఓవైసీ షాదీ ముబారక్ పథకం లబ్ధిదారుల వ్యతలను హైలైట్ చేశారు. చెక్‌లు అందడంలో ఆలస్యం అవుతోందని అన్నారు. మజ్లీస్ పార్టీ ఈ పద్ధతిని సహించబోదని అన్నారు. మజ్లీస్ పార్టీ బిజెపి ప్రభావాన్ని ఎదుర్కొనడంపైనే ఫోకస్ పెట్టినప్పటికీ, ఆదిలాబాద్ అభివృద్ధిని నిర్లక్షం చేయబోదన్నారు.
2014, 2018 ఎన్నికల్లో బిజెపిని ఓడించడంలో ఎఐఎంఐఎం కీలక పాత్ర పోషించినట్లు అసదుద్దీన్ తెలిపారు. ఆదిలాబాద్‌లో మజ్లీస్ పార్టీ ప్రాతినిద్యం వహిస్తున్న మున్సిపల్ వార్డులు ఒకవేళ అభివృద్ధిని నోచుకోకుంటే, అది మజ్లీస్ పార్టీకి కలవర విషయమే అవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ఎంఎల్‌ఏలకు కూడా అది ముప్పే కాగలదన్నారు. తన పాజిటివ్ సిగ్నల్ లేకుండా ముస్లిం ఓటర్లు ఏ ఇతర పార్టీలకు ఓటేయబోరని ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో ఆర్‌ఎంఐ ఉద్యోగాలు పొందడానికి కొందరు వ్యక్తులు అధికారులకు ముడుపులు చెల్లించారని అన్నారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ దాటి పోటీ చేయడం అన్నది మజ్లీస్‌కు ఇదే తొలిసారి కాదు. తెలంగాణలోని 119 సీట్లలో కనీసం 50 స్థానాలకు పోటీ చేయాలని మజ్లీస్ పార్టీ భావిస్తున్నట్లు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇదివరలో 2018 డిసెంబర్ 7న జరిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) పార్టీ కాస్తా భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీగా మారింది. గడచిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ 119 సీట్లలో 88 సీట్లు గెలుచుకుంది. కాగా నాడు కాంగ్రెస్ పార్టీ 21 స్థానాల నుంచి 19 స్థానాలకు కుదించుకుపోయింది. మజ్లీస్ పార్టీ దాదాపు ఏడు స్థానాలు గెలుచుకుంది.
మరోవైపు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి తెగ ప్రయత్నించింది. కానీ గెలిచింది మాత్రం ఒకే ఒక్క సీటు. బిజెపి గత ఎన్నికల్లో ఐదు నుంచి ఒక్క స్థానానికి పడిపోయింది. ఈసారి దాని వ్యూహం ఎలా ఉందో ముందుముందు చూడాలి. గెలిచేందుకు మాయోపాయాలన్నీ పన్నే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుండగా మజ్లీస్ పార్టీ ఓల్డ్ సిటీ దాటి బయట పోటీ చేయాలనుకోవడం అనేక కీలక పార్టీలకు కలవరం కలిగిస్తోంది. అయినా బిజెపి కీలక నాయకులను ఓడించడంలో ముస్లిం ఓటర్లు ఎవరి పక్షాన నిలబడతారన్నది ప్రశ్న. బిఆర్‌ఎస్‌కా లేక కాంగ్రెస్‌కా అన్నది ఓ ప్రశ్న. ఎందుకంటే ఈసారి ఇతర పార్టీల నుంచి కొందరు బడా నాయకులు బిజెపిలో ఏదో కారణం చేత చేరారు. ఉదాహరణకు ఈటల రాజేందర్, కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటి వారు.
The Adilabad MLA may face a big loss in the upcoming Telangana elections .Listen what @asadowaisi said. | BT NEWS pic.twitter.com/WuNXmYZRv7
— Junaid Ali Mohammed (@JunaidAliMoham1) May 28, 2023