Friday, November 15, 2024

ఇది ఎన్డీయే ప్రభుత్వమా లేక ఎన్పీయే ప్రభుత్వమా

- Advertisement -
- Advertisement -

Is it the NDA government or NPA government?: KTR

కేంద్ర ప్రభుత్వ పాలనపై మంత్రి కెటిఆర్ చురకలు
విహెచ్‌పి బెదిరింపులు..
మీరు చట్టానికి అతీతులా?.. అమిత్‌షాకు కెటిఆర్ సూటి ప్రశ్న..!

హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్పీయే(నాన్ పర్‌ఫార్మింగ్ అసెట్) గా అభివర్ణించారు. ‘భారతదేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డు గరిష్టానికి చేరుకున్నాయి. ఎల్‌పిజి సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికం మన దేశంలోనే ఉంది. వినియోగదారుల విశ్వాసం అత్యల్పంగా ఉందని ఆర్‌బిఐ చెబుతోంది’ అంటూ కెటిఆర్ పేర్కొన్నారు. ‘దీనిని మనం ఎన్డీయే ప్రభుత్వం అని పిలవాలా లేక ఎన్పీయే ప్రభుత్వం అనాలో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. మరోవైపు…విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) చట్టానికి అతీతంగా ఉందా? అంటూ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ మంగళవారం అన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పూరిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి తమ కార్యకర్తలపై ఏదైనా చర్య తీసుకుంటే ఢిల్లీ పోలీసులపై యుద్ధం చేస్తామని విశ్వహిందూ పరిషత్ బెదిరించినట్లు వచ్చిన రిపోర్టులు నేపథ్యంలోనే మంత్రి కెటిఆర్ పై వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులపై ఈ విపరీతమైన ధోరణిని సహిస్తారా? అని అమిత్‌షాను ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ ఢిల్లీలో చోటు చేసుకున్న మత హింసాత్మక ఘటనలపై స్పందించారు. విశ్వహిందూ పరిషత్ పోలీసులను బెదిరించిన వ్యాఖ్యలపై.. ‘మీరు దేశ చట్టానికి అతీతులా? హోం మంత్రి అమిత్‌షాజీ’ అని ట్వీట్ చేశారు. అలాగే, ‘మీకు నేరుగా నివేదించే ఢిల్లీ పోలీసులపై ఇలాంటి దారుణమైన అర్థం లేని మాటలు మీరు సహిస్తారా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించినందుకు నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి స్థానిక విశ్వ హిందూ పరిషత్ నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత విహెచ్‌పి ఇలాంటి బెదిరింపులు చేసింది. కాగా, జహంగీర్‌పూరిలో హనుమాన్ జయంతి ఉరేగింపు సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి తమ కార్యకర్తలపై ఏదైనా చర్య తీసుకుంటే ఢిల్లీ పోలీసులపై యుద్ధం ప్రారంభిస్తామని విశ్వహిందూ పరిషత్ సోమవారం బెదిరించింది. అనుమతి లేకుండా ఊరేగింపు చేపట్టినందుకు నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, స్థానిక విహెచ్‌పి నాయకుడు ప్రేమ్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపిన తర్వాత ఈ హెచ్చరికలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News