Tuesday, November 5, 2024

టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు నిజమేనా?

- Advertisement -
- Advertisement -

Is it true that there are irregularities in ticket sales?

హెచ్‌సిఎ తీరుపై వెల్తువెత్తుతున్న విమర్శలు

మన తెలంగాణ/హైదరాబాద్: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మూడో టి20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకం వ్యవహారం మరింత ముదిరింది. టికెట్ల విక్రయాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పుమన్న విషయం తెలిసిందే. కాగా, టికెట్ల అమ్మకానికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ సంఘం అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హెచ్‌సిఎకు చెందిన కొంత మంది పెద్దలు టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అభిమానులు, హెచ్‌సిఎ మాజీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే ఇన్నీ ఆరోపణలు వస్తున్న హెచ్‌సిఎ అధ్యక్షుడు అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ తదితరులు ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. టికెట్ల అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎదుమ్కాగా, హెచ్‌సిఎ అధికారులు అక్రమాలు జరగలేదని పేర్కొంటున్నా వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఉప్పల్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, కొందరు టికెట్లను భారీ మొత్తంలో బ్లాక్‌లో అమ్ముకుని డబ్బులు దండుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత నెలకొంది. ఇక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. అయితే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని భావించిన క్రికెట్ ప్రేమీకుల ఆశలపై హెచ్‌సిఎ అధికారులు నీళ్లు చల్లారు. టికెట్ల అమ్మకాల విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తడం, పరిస్థితి లాఠీఛార్జి, తొక్కిసలాటకు దారి తీయడంతో అభిమానులు ఎంతో మనో వేదనకు గురయ్యారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పేరుతో టికెట్లను విక్రయించడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇక చాలా మందికి టికెట్లు దొరకనే లేదు. దీంతో మ్యాచ్‌ను చూడాలని భావించిన వేలాది మంది క్రికెట్ అభిమానులకు వేదన మాత్రమే మిగిలింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News