Thursday, January 23, 2025

లాసెట్ కౌన్సెలింగ్ ఏటా ఆలస్యమేనా?

- Advertisement -
- Advertisement -

ఇప్పటికీ పూర్తికాని కళాశాలలకు అఫిలియేషన్ల ప్రక్రియ
సకాలంలో ఫలితాలు విడుదలైనా కౌన్సెలింగ్‌లో జాప్యమే

మనతెలంగాణ/ హైదరాబాద్ : న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఫలితాలు విడుదలై రెండు నెలలకుపైగా గడుస్తున్నా ఇప్పటివరకు కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించలేదు. రాష్ట్రంలో న్యాయ విద్య కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుబంధ గుర్తింపు ఇవ్వకపోవడంతోనే కౌన్సెలింగ్ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బి, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతి సంవత్సరం లాసెట్, పిజిఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం మే 25న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించగా, జూన్ 15న ఫలితాలు విడుదల చేశా రు. ఈ ఫలితాలు వెలువడి సుమారు రెండు నెల లు గడుస్తున్నా ఇప్పటివరకు కౌన్సెలింగ్‌లో మా త్రం కదలిక లేదు. రాష్ట్రంలో దాదాపు అన్ని వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగా, మరికొన్ని సెట్ల కౌన్సెలింగ్ కొనసాగుతోంది.

లాసెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రం ఇంకా కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కో ర్సులలో మొత్తం 7,560 సీట్లు అందుబాటులో ఉం డగా, గత విద్యాసంవత్సరం 6,230 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రతి సంవత్సరం లాసెట్ కౌన్సెలింగ్ ఆలస్యంగానే జరుగుతోంది. మిగతా వృత్తి విద్యా కోర్సులకు జూన్, జులై నెలల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుండగా, లాసెట్ మాత్రం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా లాసెట్ కౌన్సెలింగ్‌కు మరో నెల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఏటా కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తరగతులు కూడా ఆలస్యంగా ప్రారంభమై సెమిస్టర్ షెడ్యూల్‌లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మిగతా కోర్సుల పరీక్షల షెడ్యూల్‌కు న్యాయవిద్య పరీక్షల షెడ్యూల్ నెల నుంచి రెండు నెలల వరకు వ్యత్యాసం ఉంటుంది. సకాలంలో కౌన్సెలింగ్ జరగకపోవడంతో న్యాయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో ఫలితాలు కూడా త్వరగా వెలువడ్డాయి. అనుబంధ గుర్తింపు సమస్య ప్రతి సంవత్సరం న్యాయ కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ) అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. అది పొందిన కళాశాలల్లోని కోర్సులకే కౌన్సిలింగ్ నిర్వహించాలి. అయితే ఇప్పటివరకు కళాశాలలకు అనుమతి లభించకపోవడంతో కౌన్సెలింగ్ తేదీలపై స్పష్టత రాలేదు. కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయితేనే రాష్ట్రంలో ఏ కళాశాలలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఖరారవుతుంది. సీట్ల వివరాలపై స్పష్టత వస్తే తప్ప కౌన్సెలింగ్ నిర్వహించలేరు. ఈ నేపథ్యంలో లాసెట్ కౌన్సెలింగ్ ఈ ఏడాది కూడా ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
బిసిఐని సంప్రదించాం : పాపిరెడ్డి
న్యాయ కళాశాలలకు త్వరగా అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ)ని సంప్రదించామని రాష్ట్ర ఉన్న త విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. త్వరలో న్యాయ కళాశాలలకు అనుబంధ గుర్తింపు వస్తుందని అన్నారు. అఫిలియేషన్ ప్రక్రి య పూర్తయిన వెంటనే కౌన్సెలింగ్ షెడూల్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News