- ప్రాణం తీసిన వైద్యులే డబ్బులు చెల్లించారా ?
- మొత్తం రూ.12 లక్షలతో ఒప్పందాలా ?
నారాయణఖేడ్ టౌన్: ప్రాణం పోసే వైద్యులే ప్రాణాలను తీ స్తూ ప్రాణాలు పోయిన కుటుంబీకులకు డబ్బులను ఎరవేసి ఒప్పందాలు కుదుర్చుకొని ప్రాణం విలువ డబ్బులకే ముడికట్టడంతో సభ్య సమాజం తలదించుకునేలా ఇలాంటి ఒప్పందాలకు బలిచేయడం ఎంత వరకు సమంజసమని పలువు రు ప్రశ్నిస్తున్నారు…? కాగా ఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని సింగార్‌బొగుడతండాకు చెందిన భూలిబాయి ప్రసవం కోసం రాగా వైద్యుల నిర్లక్షంతో ప్రాణాలు విడిచిన సంఘటన విధితమే. కాగా ఈ ప్రసవం వైద్యులే చేశారా .. సీజరింగ్ చేశారా.. ప్రయోగం చేశారా… అసలు వైద్యులు ఉన్నారా , సిబ్బంది ఎవరైన ప్రయోగం చేశారన్న అనుమానాలు మొదలైనప్పటికీ బాలింత మాత్రం బలైంది.
కాగా సాయి సంజీవని ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన భూలిబాయికి అధిక రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఆసుపత్రి వైద్యులు, నిర్వాహకులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది.. ? కాగా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగగా పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. ఇలాంటి విషయాలను ఎలాగైన బయటకు పొక్కనివ్వద్దనే ఆలోచనతో కుటుంబ సభ్యుల ఆందోళనను అరికట్టాలన్న ఉద్దేశ్యంతో ఆసుపత్రికి చెడ్డపేరు రాకుండా లోలోపలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది…? కాగా పెద్దశంకరంపేట మండల పరిధిలో మృతదేహాన్ని ఉంచి అక్కడే బేరమాడి రూ.9లక్షలకు కుదుర్చుకోగా కొందరు సంబంధిత అధికారులకు మరో రూ.3లక్షల ముడుపులు చెల్లించగా మొత్తం రూ.12లక్షలతో ఈ సమస్యను కప్పిబుచ్చినట్లు సమాచారం… ?
ఏదీఏమైన ప్రాణం విలువను ల క్షల్లో లెక్కకట్టి నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని పలుకుబడి గల సాయి సంజీవని ఆసుపత్రి నిర్వాహకులు ఇలాంటి సంఘటనలకు దిగ డం స మంజసంకాదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రాణాలు పోయిన సం బంధి త చట్టాలు, శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పలుకుబడిగల వా రికే పబ్బంగడుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు..? పలుకుబడి ఉంటే ఏదైన సాధించవచ్చునన్న కొందరి ధీమాకు ఇలాంటి అమాయకులబలే సాక్షం గా నిలుస్తుంది. కాగా తప్పులు కప్పిబుచ్చుకున్న నేరాలు బయటకు పొ క్కకున్న కాలం నిర్ణయించే తీర్పులో న్యాయం ఎవరికి మిగులుతుందో వేచిచూద్దాం.