Monday, December 23, 2024

ప్రధాని మోడీ డిగ్రీ పొందడం నిజమేనా: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అసలు ఎంతవరకూ చదివారనే అంశంపై తన అనుమానాలు మరింత బలపడ్డాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ డిగ్రీ అంశంపై గుజరాత్ హైకోర్టు తీర్పు వెలువరించడం, కేజ్రీవాల్‌కు జరిమానా వేస్తూ ప్రధాని డిగ్రీవివరాల వెల్లడి అవసరం లేదని పేరొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ చదువు విషయంపై వివాదం మరింత ముదిరింది. ఏకంగా గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనే డిగ్రీపై అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయని కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఆయనకు సరైన విద్యానుభవం ఉండి ఉంటే దేశంలో పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలకు దిగి ఉండే వారు కాదని కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పుడు తన ప్రశ్న ఒక్కటే అని, 21వ శతాబ్ధంలో భారతదేశ ప్రధాని విద్యావంతుడు అయ్యి ఉండాలా? అవసరం లేదా? అనేదే అని నిజానికి దేశానికి విద్యావంతుడైన ప్రధాని అవసరం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు వస్తోందని, దీనిని ఎవరు ఏ విధంగా ప్రస్తావించారనేది ఇప్పటి నేపథ్యంలో అందరికీ తెలిసిందే అన్నారు. ప్రధాని మోడీకి చెల్లుబాటు అయిన డిగ్రీ ఉంటే దీనిని గుజరాత్ యూనివర్శిటీ వారు ఎందుకు ధైర్యంగా దీనిని చూపించడం లేదని, ఎందుకు నానబెడుతున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇక్కడ రెండు విషయాలు కీలకంగా మారుతున్నాయి .

1 ) ప్రధాని మోడీ విద్యార్హతపై గుజరాత్ వర్శిటీ సమాచారం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. దీనికి కారణం మోడీ ఆగ్రహానికి గురవుతామనే భయం అయి ఉండొచ్చు

2) లేదా ఆయన డిగ్రీ పొందడం కట్టుకథ అయి ఉంటుంది. లేదా ఈ సనదు నకిలీది అయి ఉంటుందన్నారు.
గుజరాత్ యూనివర్శిటీ నుంచి తమకు మోడీ డిగ్రీ అందించాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) వెలువరించిన ఉత్తర్వులను ఇటీవల గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు తీర్పు దేశమంతటిని నివ్వెరపర్చిందని, సమాచారం పొందే హక్కును ఇది కాదనడమే అవుతోంది. పైగా సమాచారం కోసం వెళ్లిన వారిపై జరిమానాలకు దిగడం మరీదారుణం అయిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం అయ్యి, జరిమానాలకు దారితీస్తుందా ? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మొత్తం మీద హైకోర్టు తీర్పుతో ప్రధాని డిగ్రీపై అనుమానాలు మరింత మిక్కుటించాయని తెలిపారు. తనకైతే ప్రధాని మోడీ పెద్దగా చదువకున్న వ్యక్తి కాదనే అన్పిస్తోందని, ఎందుకు అంటే పెద్ద నోట్లరద్దు వంటి చర్యలకు విద్యావంతులు దిగబోరని వ్యాఖ్యానించారు. ఇక జిఎస్‌టి చాలా మంచి ఆలోచన అయితే దేశాన్ని ఆర్థికంగా నాశనం చేసిన మోడీ ప్రభుత్వం దీనిని అమలుపర్చడంతో ఇది బూడిదలో పోసిన పన్నీరు అయిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News