Wednesday, January 22, 2025

అవినీతి పార్టీకి చెందిన రాహుల్ గాంధీ అక్రమాలపై మాట్లాడడమా?: కెటిఆర్ ఎద్దేవా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఇడికి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ఇప్పటికే పట్టుబడ్డారు. స్వాతంత్య్రం వచ్చినతర్వాత కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారు. ఇలాంటివారు పార్టీలో ఉంటారని మహాత్ముడు ఆనాడే ఊహించారేమోనని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. పిసిసి పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఒకరు పిసిసి ప్రెసిడెంట్ పోస్టును విక్రయిస్తే, మరొకరు కొనుగోలు చేశారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్నా,  అక్రమాలపై రాహుల్ లెక్చర్లు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. అవినీతి అనేది ‘స్కాంగ్రెస్’ పేరులోనే ఉందంటూ మరో పోస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News