- Advertisement -
కాబూల్ : తూర్పు అఫ్గానిస్థాన్‌లో స్థానిక రేడియో, టివి స్టేషన్లలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా జర్నలిస్టులను తామే మంగళవారం హత్య చేసినట్టు ఇస్లామిక్ స్టేట్ గ్రూపు బుధవారం వెల్లడించింది. ఈ ముగ్గురి మృతదేహాల అంత్యక్రియలకు అనేక మంది పాల్గొన్నారు. ఈ హత్యలను చేశాడన్న అనుమానంతో పోలీసులు జలాలాబాద్‌లో క్వారీ బసెర్ అన్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు తాలిబన్ అని ఆరోపించారు. అయితే దీన్ని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తోసిపుచ్చారు. ఈ ముగ్గురు మహిళలు మతభ్రష్ట అఫ్గన్ ప్రభుత్వ విధేయ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నందున వారిని టార్గెట్ చేశామని ఉగ్రవాదులు ప్రకటించారు. మహిళా జర్నలిస్టులపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. ఈముగ్గురితో కలిపి 15 మంది మీడియా జర్నలిస్టులు గత ఆరు నెలల్లో హత్యకు గురయ్యారు.
- Advertisement -