Wednesday, January 22, 2025

ఇదేనా మీ అచ్చే దిన్…!?

- Advertisement -
- Advertisement -
ఉద్యోగాల భర్తీపై కేంద్రానికి కెటిఆర్ ట్వీట్ !

హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల ఖాళీలపై గురువారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని తాకాయని పేర్కొన్నారు. 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు 11 శాతం ఉండగా, 2004లో ‘భారత్ వెలిగిపోతున్న’ సమయంలో సెంట్రల్ గర్నమెంట్‌లో ఖాళీలు 12.1శాతం ఉంటే, ఇప్పుడు కేంద్రంలో ఖాళీలు 25 శాతానికి చేరాయని విమర్శించారు. ఈ సందర్భంగా గణాంకాలతో ట్వీట్ చేశారు.

హోంమంత్రిత్వశాఖలో 11.1శాతం, రైల్వేలో 20.5శాతం, డిఫెన్స్ సివిలియన్ 40.2శాతం, రెవెన్యూలో 41.6 శాతంతో పాటు తదితర విభాగాల్లో ఖాళీలున్నాయని పేర్కొన్నారు. 2004 ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి వాజ్‌పేయి ఉండేవారు. ఆ సమయంలో ఎన్నికలకు వెళ్లే ముందు బిజెపి భారత్ వెలిగిపోతోంది అన్న అర్థంతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ప్రచారం రివర్స్ అయింది.

ప్రజలు బిజెపిని ఆదరించలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపిఎ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా బిజెపి అచ్చే దిన్ అనే ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో అప్పటి కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖాళీగా ఉన్నాయని, ఖాళీ అవుతున్న ప్రతి నాలుగు ఉద్యోగాల్లో మూడు మాత్రమే భర్తీ చేస్తున్నారని, మరొక దాన్ని ఖాళీగా ఉంచుతున్నారని కెటిఆర్ ఆరోపిస్తున్నారు. ‘2004 నాటికి కేంద్రంలో ఖాళీలు 12.1 శాతం ఉండగా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముగిసే సమయారనికి దాదాపు 11 శాతం చేరుకుంది, తిరిగి మోడీ హయాంలో ఆ సంఖ్య దాదాపు 25 శాతానికి చేరుకుంద’ని విశదీకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News