Friday, November 22, 2024

మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా : డికె అరుణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పోరాడుతున్న ఎమ్మెల్సీ కవిత.. బిఆర్‌ఎస్‌లో మహిళలకు 3 శాతం సీట్లే కల్పించడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కెసిఆర్‌కు దమ్ముంటే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై పోటీ చేయాలని సవాల్ విసిరారు. బిసి బిడ్డ గంప గోవర్ధన్‌ను పక్కన పెట్టి కెసిఆర్ పోటీ చేయడం దుర్మార్గమని విమర్శించారు.ఓడిపోతాననే భయంతోనే కెసిఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారన్నారని ఆమె విమర్శించారు. రాజకీయాల్లోకి రావాలని ఆశ ఉన్న అధికారులు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ఆకాంక్ష ఉంటే పదవులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని హితవు పలికారు.
మహిళా బిల్లు తీసుకొచ్చేది బిజెపినే..
మహిళ బిల్లును ప్రవేశపెట్టింది.. రానున్న రోజుల్లో తీసుకువచ్చేది బిజెపినే అని డికె అరుణ స్పష్టం చేశారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది.. ఎనిమిది మంది గవర్నర్ లను చేసిన ఘనత బిజెపిదే..అన్నారు. కీలకమైన ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖను మహిళలకు ఇచ్చిన ఘనత మోడీ ది అన్నారు. కేవలం మహిళలకు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన కెసిఆర్ దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కనీసం మహిళల రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన బిఅర్‌ఎస్‌ను తప్పించి.. బిజెపికి మద్దతును పలుకుతున్నారని వెల్లడించారు. చాలామంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయి. ఇసుక దందాలు, భూ దందాలు, 30 శాతం కమిషన్ ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఐన వారికే టికెట్లు ఇచ్చారు. ముదిరాజ్ లకు అసలు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News