Monday, December 23, 2024

నిఘా వైఫల్యానికి పూర్తి బాధ్యత మాదే: ఐఎస్‌ఎ చీఫ్

- Advertisement -
- Advertisement -

ఈ నెల 7న హమాస్ జరిపిన పాశవిక దాడుల్లో నిఘా వైఫల్యానికి పూర్తి బాధ్యత తమదేనని ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా ఏజన్సీ (ఐఎస్‌ఎ) చీఫ్ రోనేన్ బార్ అంగీకరించారు. ఈ దాడుల్లో 1300 మందికి పైగా ఇజ్రాయెలీలు సహా పలువురు విదేశీయులు మరణించారు. ఈ దాడులపై బార్ తొలిసారిగా స్పందించారు. ఈ మెరుపుదాడిపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నారు.‘ ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ అక్టోబర్ 7వ తేదీ దాడిని ముందస్తుగానే గ్రహించలేకపోయాం.ఈ నేపథ్యంలో సంస్థ అధ్యక్షుడిగా ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే’ అని ఆయన వెల్లడించినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం దీనిపై దర్యాప్తు ప్రస్తుతం చురుగ్గా జరుగుతోంది. ఈ దాడులు జరిగిన మర్నాడే ఐఎస్‌ఎతో సమన్వయానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని బార్ తెలిపారు. అపహరణకు గురైన వారిని గుర్తించి వారిని రక్షించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశ దక్షిణ భాగంలో తమ సభ్యులు ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడారని తెలిపారు. ఈ క్రమంలో పదిమంది సభ్యులను కోల్పోయామని తెలిపారు. అంతేకాదు పట్టుబడిన హమాస్ సభ్యులనుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు చెప్పారు. తాము యుద్ధంలో ఉన్నామని, కేవలం పరిస్థితి మార్పు వల్ల.. ఒక్క నిర్ణయంతోనే యుద్ధం ముగుస్తుందని, దీనికి ఎలాంటి కాలవ్యవధి లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News