- Advertisement -
జెరూసలేం: ఇజ్రాయెల్ 11వ అధ్యక్షుడిగా లేబర్ పార్టీ నేత ఐజాక్ హెర్జాగ్(60) ఎన్నికయ్యారు. బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్(నెస్సెట్)లో నిర్వహించిన రహస్య బ్యాలెట్ పద్ధతిన జరిగిన ఓటింగ్‌లో ఆయనకు మెజారిటీ ఎంపీలు మద్దతు తెలిపారు. 120 మంది సభ్యులున్న నెస్సెట్‌లో హెర్జాగ్‌కు 87 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి మిరియమ్ పెరేట్జ్‌కు 27 ఓట్లు వచ్చాయి. హెర్జాగ్ ఇజ్రాయెల్‌కు లేబర్ పార్టీ నుంచి అధ్యక్ష స్థానానికి ఎన్నికైన మొదటి నేత. హెర్జాగ్ తండ్రి చైమ్ హెర్జాగ్ 1983 నుంచి 1993 వరకు ఆ దేశ అధ్యక్షుడిగా పని చేశారు. అయితే, ఆయన అలైన్‌మెంట్ పార్టీ తరఫున ఆ పదవికి ఎన్నికయ్యారు. జులై 9న ఐజాక్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఏడేళ్లపాటు ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. తన ఎన్నిక సందర్భంగా తాను అందరివాడినంటూ ఐజాక్ వ్యాఖ్యానించారు.
- Advertisement -