Sunday, January 19, 2025

మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణాధారం: ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

Isha Foundation representatives met MP Santosh

హైదరాబాద్: కోయంబత్తూరులోని ప్రఖ్యాత ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. సద్గురు ఆధ్వర్యంలో చేపట్టి ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి మద్దతివ్వాలని ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్, శైలజ, రాఘవ తదిరులు ఎంపి సంతోష్‌కుమార్‌ను కోరారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ పుడమి పచ్చదనం పెంచడమే లక్షంగా ‘హరా హైతో భరా హై’ అనే గొప్ప నినాదంతో 17 జులై 2018న తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారి, అనుకున్న లక్షాన్ని చేరిందని ఈశా ఫౌండేషన్ సభ్యులకు వివరించారు.

మట్టికిమొక్కకు అవినాభావ సంబంధం ఉన్నట్లే ఈశా ఫౌండేషన్ చేపట్టిన సేవ్ సాయిల్ ఉద్యమానికి, తాము చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి కూడా అదే సంబంధం ఉంటుందని ఎంపి సంతోష్ అన్నారు. అందుకే ‘మట్టిని కాపాడుకుందాంమొక్కను బతికించుకుందాం’ అని ఆయన అన్నారు. సేవ్ సాయిల్ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈశా ఫౌండేషన్ చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను ఎంపి సంతోష్‌కు ఈశా ప్రతినిధులు తెలియజేశారు. సద్గురు ఆధ్వర్యంలో ‘సేవ్ సాయిల్’ ఉద్యమాన్ని చేపట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటనలను విజయవంతమయ్యాయని, ప్రస్తుతం ప్రపంచ యాత్ర జరుగుతున్నదన్నారు. ఆ యాత్రా విశేషాలను ఎంపి సంతోష్‌కు వివరించారు. అలాగే, త్వరలోనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించిన ఎంపి సంతోష్‌కుమార్ తప్పక హాజరవుతానని, ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News