Saturday, November 23, 2024

ఇసాసింగ్ ఈసారైనా

- Advertisement -
- Advertisement -

ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీలో హైదరాబాద్ అమ్మాయి
ఫేవరేట్‌గా మను బాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్లపైనే ఆశలు
పతకాల సంఖ్య పెరిగేనా?

మన తెలంగాణ/ క్రీడా విభాగం : మరో నాలుగు రోజుల్లో మహా సంగ్రామం పారిస్ ఒలింపిక్స్‌కు తెరలేవనుంది. జులై 26 నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీల్లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. వీరిలో 21 మంది షూటర్లు బరిలోకి దిగుతున్నారు. మను బాకర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి మేటీ షూటర్లు పతకాల కోసం నడుంబిగించారు. ఇప్పటి వరకు షూటింగ్‌లో భారత్‌కు నాలుగు పతకాలు దక్కాయి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రజతంతో ఖాతా తెరిస్తే.. నాలుగేళ్ల తర్వాత బీజింగ్ ఒలింపిక్స్(2008)లో అభినవ్ బింద్రా స్వర్ణంతో చరిత్ర లిఖించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ సిల్వర్ మెడల్, హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ కాంస్యం పతకం సాధించారు. కాగా ఇప్పుడు పారిస్ గేమ్స్‌లో షూటర్లుపై అందరి దృష్టి పడింది. ఈ పోటీల్లో షూటర్లు ఎన్ని పతకాలు సాధిస్తారనే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు వరుసగా మూడు దఫాలుగా షూటింగ్‌లో పతకాలు సాధించడంతో భారత షూటర్లపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ రియో, టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాలు సాధించలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్‌కు రికార్డ్ స్థాయిలో 15 మంది షూటర్లు బరిలో నిలిచినా ఒక్కరు పతకాన్ని దక్కించుకోలేకపోయారు.

బరిలో 21 మంది షూటర్లు..

పారిస్ గేమ్స్‌కు అర్హత సాధించిన షూటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఆసియా క్రీడల్లో అసాధారణ ప్రదర్శనతో 9 స్వర్ణాలు గెలిచిన వీరు ఇదే జోరును పారీస్ ఒలింపిక్స్‌లోనూ కొనసాగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి అద్భుత ప్రదర్శనతో మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది షూటింగ్ టీమ్. ఈ సారి ఏకంగా రికార్డు స్థాయిలో 21 మంది షూటర్లు పారిస్ బరిలో నిలిచారు. యువ షూటర్ మను బాకర్ మూడు విభాగాల్లో పోటీ పడబోతుంది. వ్యక్తిగత విభాగాల్లో రైఫిల్‌లో 8 మంది, పిస్టల్‌లో 8 మంది, షాట్‌గన్‌లో ఆరుగురు పతకాల కోసం పోటీపడుతున్నారు. ఈ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే భారత్‌కు 16 పతకాలు ఖా యం. మిక్స్‌డ్ ఈవెంట్లలో ఐదు జోడీలు బరిలో దిగనున్నాయి. దీంతో ఈసారి పతకాల సంఖ్య మరింత పెరగొచ్చు అనడంలో సందేహం లేదు.

ఫేవరేట్‌గా మను బాకర్, ఇషా సింగ్

భారత స్టార్ షూటర్, డిపెండింగ్ మెడలిస్ట్ మను బాకర్ ఫేవరేట్‌గా పారిస్ గేమ్స్ బరిలోకి దిగుతోంది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌తో పాటు 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లలో తలపడనుంది. అంతేకాదు.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్లో సరబ్‌జ్యోత్‌తో కలిసి బరిలోకి దిగనుంది. ఆసియా క్రీడల్లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన ఈ స్టార్ షూటర్. ఇదే ఆత్మవిశ్వాసంతో పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటాలని చూస్తోంది. ఏదీఏమైనా మనుబాకర్ పతకం కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక, ఈ షూటింగ్ టీమ్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ సయితం ఉంది. 19 ఏళ్ల ఇషా సింగ్ కొన్నేళ్లుగా ప్రపంచ స్థాయిలో రాణిస్తోంది. ఈ ఒలింపిక్స్ గేమ్స్‌లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పోటీ పడనున్న ఇషా సింగ్.. ఆసియా క్రీడల్లో ఆమె 4 పతకాల్లో మెరిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News