Tuesday, April 1, 2025

IPL 2024: ఇషాన్ కిషన్ కు జరిమానా

- Advertisement -
- Advertisement -

ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కు షాకిచ్చింది ఐపిఎల్ యాజమాన్యం. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఇషాన్ కిషన్ కు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు.

‘ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఇషాన్ కిషన్ ఉల్లంఘించాడు. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్‌ 2.2 కింద లెవెల్‌ 1 స్థాయి ఉల్లంఘించినందుకు అతనికి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నాం. ఇందులో మ్యాచ్‌ రెఫరీ నిర్ణయమే అంతిమం’ అని ఐపీఎల్‌ ప్రకటనలో తెలిపింది.

కాగా, ముంబైపై ఢిల్లీ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఒవర్లలో 257 పరుగులు చేసింది. అనంతరం 258 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓటమి 20ఓవర్లలో 247 రన్స్‌కే పరిమితమైంది. తిలక్‌వర్మ(63) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. కెప్టెన్ హార్దిక్(46), టిమ్ డేవిడ్(37), సూర్యకుమార్(26), ఇషాన్(20) ఫరవాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ 3, ఖలీల్ 2, రసిక్ 3 వికెట్లు తీశారు. ఇది ముంబై ఇండియన్స్ కి 6వ ఓటమి కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News