ఇషాన్ కిషన్ చేసిన తప్పుకు టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ ను స్టంప్ ఔట్ చేసే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్న(మంగళవారం) ఆసీస్ జట్టుతో జరిగిన మూడో టీ20లో విజయానికి చేరువగా వచ్చిన భారత్ ను..అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించకుని ఆసీస్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో గెలుస్తుందనుకున్న భారత్ కు ఓటమి తప్పలేదు. చివరి రెండు ఓవర్లలో ఆసీస్ విజయానికి 45 పరుగులు కావాల్సి ఉండగా..19వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు. అయితే, ఈ ఓవర్లో కీపర్ ఇషాన్ కిషన్ చేసిన తప్పిదమే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.
19వ ఓవర్లలో అక్షర్ వేసిన బంతిని ఆసీస్ బ్యాట్స్ మెన్ మ్యాథ్యూ క్రీజు వదిలి కొంచెం ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించగా.. మిస్ అయిన బంతిని అందుకుని స్టంప్స్ పడగొట్టాడు. ఔట్ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో మ్యాథ్యూ ఔట్ కాకపోగా.. బంతిని అందుకునే క్రమంలో ఇషాన్ గ్లోవ్స్ స్టంప్స్ కన్నాముందుకు రావడంతో అంపైర్ ఆ బంతిని నోబాల్ గా ప్రకటించారు. దీంతో దొరికిన అవకాశాన్ని మ్యాథ్యూస్ సిక్సర్ గా మలిచాడు. చివరి బంతికి బైస్ రూపంలో మరో నాలుగు పరుగులు వచ్చాయి. ఇక, చివరిలో ఓవర్ లో 23 పరుగులు అవసరం కాగా.. మ్యాక్స్ వెల్ విధ్వసంకర ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను గెలిపించాడు.
Itne main to Dhoni 3 baar stump kar deta #MSDhoni #INDvsAUS #IshanKishan pic.twitter.com/Faet0ofhZN
— INDIयन Critics 🚩 (@indi_critics) November 28, 2023
భారత బౌలర్లను హడలెత్తించిన మ్యాక్స్‌వెల్ 48 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 8 బౌండరీలతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి కెప్టెన్ మాథ్యూవేడ్ 28 (నాటౌట్) అండగా నిలిచాడు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన రుతురాజ్ 57 బంతుల్లోనే 7 సిక్సర్లు, 13 ఫోర్లతో 123 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక సూర్యకుమార్ 39, తిలక్ వర్మ 31 (నాటౌట్) అతనికి అండగా నిలిచారు.