Sunday, April 20, 2025

తీరు మారని ఇషాన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇషాన్ నిరాశ పరిచాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన ఇషాన్ మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ ఆ తర్వాత ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నిరాశే మిగిల్చాడు. కీలకమైన ముంబై మ్యాచ్‌లో అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కానీ ఇషాన్ మాత్రం మరోసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ రెండు పరుగులు మాత్రమే చేశాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. రానున్న మ్యాచుల్లోనైనా ఇషాన్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తాడా లేదా అనేది సందేహంగా తయారైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News