Thursday, December 26, 2024

స్వదేశానికి ఇషాన్ కిషన్..

- Advertisement -
- Advertisement -

వ్వక్తిగత కారణాలతో టెస్టు సిరీస్‌కు దూరం
ముంబై : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఆరంభానికి ముందే టీమిండియాకు షాకులు తగులున్నాయి. చీ లమండ గాయం కారణంగా ఇప్పటికే సీనియర్ పే సర్ మహ్మద్ షమీ టెస్టు జట్టుకు దూరం కాగా.. తా జాగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇషాన్ అక్కడి నుంచి భారత్ బయల్దేరాడని బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఇ షాన్ స్థానంలో కెఎస్ భరత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉన్న భరత్ టెస్ట్ జట్టుతో కలుస్తాడని వివరించిం ది.

ఇషాన్ కిషన్ టెస్టు జట్టు నుంచి రిలీజ్ కావడానికి వ్యక్తిగత కారణాలని, టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇషానే స్వయంగా తెలిపాడని బిసిసిఐ వెల్లడించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20, టెస్ట్ సిరీస్‌ల కోసం ఇషాన్ ఎంపికయ్యాడు. టీ20ల్లో ఒక్క అవకా శం రాకపోవడంతో.. టెస్ట్ సిరీస్‌పై ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఉన్నపళంగా ఇషాన్ ఇంటి వెళ్లిపోవడంతో.. ఇండియా-ఎతో దక్షిణాఫ్రికాలోనే ఉన్న భరత్‌కు అనూహ్యంగా సెలెక్టర్ల నుంచి పిలుపు అందింది. కేఎల్ రాహుల్ తర్వాత రెండో వికెట్‌కీపర్ ఛాయిస్‌గా భరత్ ఉంటాడు. డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ ప్రా రంభం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News