హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. ఈ ఫ్రాంచైజీలో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీ సాధించి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దీంతో సన్‌రైజర్స్ 286 పరుగులు చేసి ఐపిఎల్ రెండో అత్యధిక స్కోర్ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేసింది. రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మైదానంలో పరుగుల వరదపారించింది.
అయితే అభిషేక్ (24) తీక్షణ బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన నేపథ్యంలో హెడ్, ఇషాన్‌తో కలిసి భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలో హెడ్ అర్థశతకం సాధించాడు. కానీ, కొంత సమయానికే తుషార్ బౌలింగ్‌లో హెట్మైర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన నితిష్(30), క్లాసెన్(34) తక్కువ బంతుల్లోనే బౌండరీల వర్షం కురిపించి ఔట్ అయ్యారు. ఓవైపు వికెట్లు పడుతున్న ఇషాన్ మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సులతో 106 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. రాయల్స్ బౌలింగ్‌లో తుషార్ 3, తీక్షణ 2, సందీప్ 1 వికెట్ తీశారు.