Monday, December 23, 2024

రోజు వారీ కూలీ.. ఏడుసార్లు గెలిచిన ఎంఎల్ఎ ను ఓడించాడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ రోజూవారీ కూలీ ఏడుసార్లు ఎంఎల్ఎ గా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించాడు. తాజాగా జరిగిన చత్తీస్ గఢ్ ఎన్నికల్లో ఈ ఘటనా చోటు చేసుకుంది.  ఈశ్వర్ సాహు రోజువారీ కూలీ. ఇటివలే ఈశ్వర్ కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో దోషులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలించందని ఈశ్వర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బిజెపి తరపున సాజా అసెంబ్లీ స్థానం నుంచి సాహు బరిలోకి దిగాడు.అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ రవీంద్ర చౌబే పోటీ చేశాడు.రవీంద్ర చౌబే గతంలో ఏడు సార్లు ఎంఎల్ఎ గా గెలిచారు. తాజా ఎన్నికల్లో సాహు రవీంద్ర చౌబే పై 5,527 ఓట్ల మెజారిటితో గెలుపొందాడు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మూడు రాష్ట్రాల్లోనూ బిజెపి సంపూర్ణ మెజార్టీ సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News