మాస్కో: భారత్‌లో దాడికి ప్రణాళిక రచించినందుకు రష్యా భద్రతా సంస్థ అదుపులోకి తీసుకున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాది తాను “భారత్‌లోని అధికార వర్గాల ప్రతినిధులలో ఒకరిని” లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద చర్యకు సిద్ధమవుతున్నట్లు అంగీకరించినట్లు రష్యా వార్తా సంస్థ నివేదించింది. రష్యాలోని రష్యన్ ఫెడరేషన్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌బి విడుదల చేసిన వీడియోలో ఉగ్రవాది “ప్రవక్తను అవమానించినందుకు” భారతదేశంలో ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు అంగీకరించడం వినవచ్చు.
ఐఎస్‌ఐఎస్ నేత ఒకరు టర్కీలో ఆత్మాహుతి బాంబర్‌గా రిక్రూట్ చేసిన ఉగ్రవాది, తనను తాను పేల్చేసుకోవడం ద్వారా భారత పాలక వర్గాలకు చెందిన సభ్యుడిపై ఉగ్రవాద చర్యకు పాల్పడాలని ప్లాన్ చేసినట్లు తెలిపాడు. “ముహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ఐఎస్ ప్రణాళిక యొక్క ఆదేశానుసారం తీవ్రవాద దాడికి పాల్పడటానికి నాకు అక్కడ వస్తువులు అందాల్సి ఉంది” అని ఆ వ్యక్తి చెప్పినట్లు ‘టాస్’ వార్తా సంస్థ పేర్కొంది.