Saturday, November 23, 2024

న్యూజిలాండ్‌లో ఐసిస్ కలకలం

- Advertisement -
- Advertisement -

ISIS Terrorist Shot Dead After He Stabs 6 In New Zealand

కాల్పుల్లో ఉగ్రవాది హతం
శ్రీలంక నుంచి వచ్చినట్లు గుర్తింపు

వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాది సూపర్‌మార్కెట్‌లో చేరి, ప్రజలపై కత్తితో దాడికి దిగడం సంచలనం కల్గించింది. ఈ వ్యక్తిని స్థానిక పోలీసులు సెకండ్ల వ్యవధిలోనే గుర్తించి కాల్పులు జరపడంతో మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై దేశ ప్రధాని తీవ్రస్థాయిలో స్పందించారు. ఆక్లాండ్‌లో అత్యంత రద్దీగా ఉండే సూపర్‌మార్కెట్‌లో కత్తిపట్టుకుని ఉన్మాదరీతిలో తిరుగుతూ ఉన్న వ్యక్తి ఆరుగురిపై కత్తిపోట్లకు దిగాడు. ఇది ఉగ్రవాద చర్యనే అని ప్రధాని జెసిండా అర్డెర్న్ తెలిపారు. శ్రీలంకకు చెందిన వ్యక్తి పూర్తిగా ఐసిస్ ప్రేరేపణతో ఉగ్రవాది అయినట్లు, 2011లో దేశానికి వచ్చిన ఆయన కదలికలపై 2016 నుంచి నిఘా ఉంచినట్లు ఆమె వెల్లడించారు. ఐసిస్ భావజాలంతో దాదాపుగా విపరీత మనసత్వంతో ఉన్మాది మాదిరిగా వ్యవహరిస్తున్న వైనం సూపర్‌మార్కెట్‌లో చేష్టతో స్పష్టం అయింది. ఈ వ్యక్తి కదలికలను జాతీయ భద్రతా దళం చాలా కాలంగా అనుక్షణం గమనిస్తూ వస్తోంది. సూపర్‌మార్కెట్‌కు కొనుగోళ్లకు వచ్చిన వారిలో కత్తిపోట్లకు గురయిన ముగ్గురిని వెంటనే చికిత్సకు ఆసుపత్రికి తరలించారు.

వీరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. సూపర్‌మార్కెట్‌లో ఘటన ఖచ్చితంగా ఉగ్రవాద దాడి అని ప్రధాని నిర్థారించి చెప్పారు. ఈ వ్యక్తి గురించి దేశ భద్రతా బలగాలకు పూర్తి సమాచారం ఉందని చెప్పారు. అయితే ఇప్పటివరకూ ఎటువంటి చర్యకు దిగకపోవడంతో కేవలం నిఘా పెట్టి ఉంచారని, అయితే ఇప్పుడు ఉగ్రవాద దాడికి దిగడంతో మట్టుపెట్టాల్సి వచ్చిందని ఆమె వివరించారు. మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో సూపర్‌మార్కెట్‌లో ఈ వ్యక్తి భయానక పరిస్థితిని సృష్టించాడు. ఈ వ్యక్తి నివాసం నుంచి బయలుదేరినప్పటి నుంచే భద్రతా బలగాలు అనుసరిస్తూ వచ్చాయని, తరువాత సూపర్‌మార్కెట్‌లో అంతమొందించాల్సి వచ్చిందని ప్రధాని తెలిపారు. ఒట్టిచేతులతోనే సూపర్‌మార్కెట్‌లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి ఉన్నట్లుండి అక్కడున్న కత్తిని తీసుకుని , పరుగులు తీస్తూ కన్పించిన వారిపై కత్తితో దాడికి దిగినట్లు పోలీసు కమిషనర్ అండ్రూ కోస్టెర్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News