Wednesday, January 22, 2025

పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం: షెకావత్

- Advertisement -
- Advertisement -

Union Minister Shekhawat visiting Polavaram project

అమరావతి: పోలవరం నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని షెకావత్ హామీ ఇచ్చారు. నిర్వాసితులతో మాట్లాడిన కేంద్రమంత్రి షెకావత్‌…. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వసతులు చాలా బాగున్నాయని షెకావత్ కితాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పూర్తి చేస్తాయని షెకావత్‌ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జీవనోపాధికి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

బాధితులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు.నిర్వాసితులకు స్థానికంగానే జీవనోపాధి కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు స్థానికులకు నైపుణ్య శిక్షణ కూడా అందిస్తామని జగన్ తెలిపారు. పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ అన్ని సౌకర్యాలతో ఇళ్లు నిర్మిస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక అభినందించారు. ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నట్లు కొందరు నిర్వాసితులు తెలిపారు. ఇంటి నిర్మాణాలు మరింత నాణ్యంగా ఉండేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడాలని ముఖ్యమంత్రికి సూచించాను. వ్యవసాయంతోపాటు ఉపాధి దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తాడ్వాయిలోని నిర్వాసిత కాలనీలో మంత్రి షెకావత్‌… సీఎం జగన్ పర్యటించారు. ఇళ్ల నిర్మాణాలను, సౌకర్యాలను పరిశీలించిన కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసితులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News