Friday, January 10, 2025

ఇస్కాన్ ఒక మత ఛాందసవాద గ్రూపు: బంగ్లాదేశ్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

ఇంటర్షేనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)ను హిందూ మతఛాందసవాద గ్రూపుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అభఙవర్ణించింది. ఈ ఏడాది ఏడాది ఆగస్టులో జరిగిన విద్యార్థి ఉద్యమ కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడంతో అధికారాన్ని చేపట్టిన ఆపద్ధర్మ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో ఇస్కాన్‌పై అధ్యనం చేస్తున్నామని పేర్కొంది. ఢాకాకు 300 కిలోమీటర్ల దూరంలోని రంగ్‌పూర్‌లో సోమవారం మైనారిటీ హిందువులకు రక్షణ కల్పించేందుకు పటిష్టమైన చట్టాలు చేయాలని, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

దీంతో ఆయన విడుదల కోరుతూ హిందువులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల జనాభాలో హిందువుల జనాభా 8 శాతం ఉంటుంది. షేక్ హసీనా నిష్క్రమణతో అధికారాన్ని చేపట్టిన నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో విఫలమైనట్లు విమ ర్శలను ఎదుర్కొంటోంది. హిందు వ్యాపార సంస్థలు, వారి ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ మూలాల గురించి హైకోర్టులో వాదనల సందర్భంగా బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాన్ ఆ సంస్ధను హిందూ మతఛాందసవాద గ్రూపుగా వర్ణించారు. ప్రభుత్వం ఇప్పటికే ఇస్కాన్‌పై అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News