మహాకుంభ్ నగర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహాకుంభ్ నగర్‌లో ఇస్కాన్ క్యాంప్ వద్ద మంటలు చెలరేగి సమీపంలోని డజన్ల కొద్దీ క్యాంపులకు విస్తరించింది. అవన్నీ తగులబడ్డాయని అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని తెలిపారు. ఉదయం 10.35 గంటలకు మంటలు చెలరేగాయని ప్రధాన అగ్నిమాపక అధికారి ప్రమోద్ శర్మ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆ తరువాత సమాచారం అందగానే అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని వెంటనే మంటలను ఆర్పేశాయి. మంటలు దాదాపు అరగంటపాటు కొనసాగాయి.
మంటల కారణం ఏమిటన్నది, ఎంత నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మహాకుంభ్‌మేళా డిఐజి వైభవ్ కృష్ణ అగ్నిమాపక దళం మంటలను పూర్తిగా ఆర్పేసాయని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. సెక్టార్ 19లో అధానీ ఫౌండేషన్‌తో కలిసి ఇస్కాన్ క్యాంప్‌ను నడుపుతోంది. మహాకుంభమేళాలో ఇలాంటి చిరు విపత్తులు జరగడం ఇది మూడోసారి. ఇంతకు ముందు జనవరి 19న 19వ సెక్టార్‌లో, జనవరి 25న సెక్టార్ 2లో కూడా విపత్తులు సంభవించాయి. మహాకుంభమేళా జనవరి 13న మొదలయింది. ఇది ఫిబ్రవరి 26న ముగియనున్నది.