- Advertisement -
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది. ఆయనను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ ఆమెర్ ఫరూఖ్, జస్టిస్ తారీఖ్ మహమూద్ జహంఈర్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ఈ కేసుకు సంబంధించి పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది తన వాదనలు ముగించడంతో హైకోర్టు తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది. హైకోర్టు ప్రాంగణం వెలుపల, కోర్టు లోపల భారీ పోలీసు, పారా మిలిటరీ బలగాలు మోహరించాయి.
- Advertisement -