Thursday, November 21, 2024

సంక్షోభంలో చక్కెర పరిశ్రమ

- Advertisement -
- Advertisement -

దేశంలో చక్కెర పరిశ్రమ మరొకసారి సంక్షోభంలో పడింది. చెరకు మద్దతు దర పెంచినంతగా ప్రభుత్వం చక్కెర ధర పెంచకపోవడం పెద్ద సమస్యగా మారిందని చక్కెర పరిశ్రమ తెలియజేసింది. ప్రస్తుత చక్కెర సీజన్‌లో టన్ను చెరకు మద్దతు ధరను 8 శాతం పెంచి రూ. 3400గా నిర్ణయించిన ప్రభుత్వం కిలో చక్కెరకు మిల్లులకు చెల్లించే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని 201819 నుంచి రూ. 31 వద్దే కొనసాగించడాన్ని జాతీయ సహకార చక్కెర మిల్లుల సమాఖ్య (ఎన్‌ఎఫ్‌సిఎస్‌ఎఫ్) తప్పు పట్టింది. ప్రస్తుతం కిలో చక్కెర ఉత్పత్తి ఖర్చులే రూ. 41.66కు చేరినట్లు సమాఖ్య తెలిపింది. దీనికి తోడు ఎగుమతులపై నిషేధంతో ఈ సీజన్ చివరకు దేశీయ వినియోగం పోను 115 లక్షల టన్నుల చక్కెర నిల్వలు పేరుకుపోయే ప్రమాదం ఉందని సమాఖ్య ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వమే పరిశ్రమను ఆదుకోవాలని సమాఖ్య కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News