Monday, January 20, 2025

జలమండలికి మూడోసారి ఐఎస్‌ఓ సర్టిఫికెట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ వాసులకు సురక్షిత తాగునీరును అందిస్తున్న జలమండలికి మరో ఘనత దక్కింది. తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు గాను ఐఎస్‌ఓ9001:2105 సర్టిఫికెట్‌ను ముచ్చటగా మూడోసారి అందుకుంది. ఈ ధృవీకరణను మరో 3 ఏళ్లపాటు పొగిగిస్తున్నట్లు జియో టెక్ గ్లోబల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ప్రకటించారు. ఇం దుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని మంగళశా రం జలమండలి అధికారులకు పంపించారు. ఈ ధృవీకరణ పత్రాన్ని జలమండలి టెక్నికల్ డైరెక్టర్ పి.రవికుమా ర్, ట్రాన్స్‌మిషన్ సిజిఎం దశరథ్‌రెడ్డి, ప్రధాన కార్యాలయం లో ఎండి దాన కిశోర్‌కు అందజేశారు. ఐఎస్‌ఓ ధృ వీకరణ పోడిగింపు పట్ల ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న జలమండలి ఉద్యోగులు, సిబ్బందిని దానకిశోర్ అభినందించారు.
జలమండలికి 2017లో
మొదటిసారి ఐఎస్‌ఓ ధృవీకరణ పత్రం
ప్రప్రథమంగా 2017 జూలైలో జలమండలి ఐఎస్‌ఓ ధృవీకరణ పత్రాన్ని అందుకోగా దాని కాల పరిమితి 2020 జూలై వరకు ఉండగా దానిని మరోసారి 2023 జూలై వరకు పొడిగించారు. ఇదేక్రమంలో తాజాగా మ రోసారి మూడేళ్ల వరకు 2026 జూలై వరకు పొడిగిస్తూ జియో టెక్ గ్లోబల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జలమండలికి ధృవీకరణ పత్రాన్ని పంపించారు. నగరవాసుల కోసం ఇటు కృష్ణా నది, నాగార్జున సాగర్ నుంచి అటు గోదావరి నదితో పాటు సింగూరు, మంజీర, ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని సేకరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల మేరకు శుద్ధ్దీకరించి సరఫరా చేస్తోంది.
మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ
నీటి సరఫరాలో జలమండలి ఇప్పటికే మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అలంబింస్తోంది. మొదటి దశలో నీటి శుద్ధ్ది కేంద్రాల వద్ద రెండవ దశలో బ్యాలెన్సింగ్ రిజర్వాయ్లు వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. దీంతో పాటు ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో ఖచ్చితంగా 0.5 పిపిఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలను తీసుకుంటోంది. నగరవాసులకు పూర్తి శుద్ధ్దమైన నీరు అందించేందుకు ఇండియన్ స్లాండర్డ్ (ఐఎస్ 105002002) ప్రమాణాల్ని పాటిస్తూ శాస్త్రీయంగా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News