Tuesday, November 26, 2024

వర్థమాన క్రికెట్ స్టార్ల వెలికితీతకు ఐఎస్‌పిఎల్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

భారత మాజీ సెలక్టర్ జతిన్ పరాజపే

మన తెలంగాణ / హైదరాబాద్ : వర్ధమాన క్రికెట్ స్టార్లను వెలికి తీసేందుకు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్ పిఎల్) సిద్ధమని భారత మాజీ క్రీడా సెలక్టర్ జతిన్ పరాజపే తెలిపారు. ఇప్పటికే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తో హైదరాబాద్ నుంచి టీమ్ ఇండియాకు భవిష్యత్ స్టార్లను ఎంపిక చేస్తున్నామన్నారు. ఐస్ పిఎల్ ప్రారంభ ఎడిషన్ 2024 మార్చి 2 నుంచి 9వ తేదీ వరకు జరగనుందని, ముంబై లో 19 ఉత్కంఠ భరిత మ్యాచ్ లు ఉంటాయని ఆయన వెల్లడించారు. టోర్నమెంట్ లో ఆరు జట్లు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ (జమ్మూ- కాశ్మీర్) పోటీ పడుతున్నాయని ఐఎస్ పీఎల్ సెలక్షన్ కమిటీ హెడ్ జతిన్ పరాంజపే తెలిపారు.

ఈ మేరకు హైదరాబాద్‌లో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎస్‌పిఎల్ సెలక్షన్ కమిటీ హెడ్ జతిన్ పరాంజపే మాట్లాడుతూ టెన్నిస్ బాల్ , క్రికెట్‌కు భారీ ఫాలోయింగ్ ఉందన్నారు. చాలా మంది ఆటగాళ్లు అసాధారణమైన ప్రతిభను కలిగి ఉన్నారని, కానీ వేదిక, ఆటలో ముందుకు వెళ్లాలనే విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో ఆ ప్రతిభకు ఎక్కువగా గుర్తింపు లభించడం లేదన్నారు. అలాంటి వారి కోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తమ సహకారం అందిస్తోందన్నారు.

ఈ టోర్నమెంట్ ఆటగాళ్లకు రంజీ ట్రోఫీ, దేశీయ టోర్నమెంట్ లో ఆడిన అనుభవజ్ఞులైన ఆటగాళ్ల నుంచి అమూల్యమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని జతిన్ పరాంజపే తెలిపారు. తద్వారా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ద్వారా భారత క్రికెట్ జట్టులోకి హైదరాబాద్ నుంచి చాలా మంది ఆటగాళ్లు వస్తారని తాను నమ్ముతున్నానని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఫాస్ట్ బౌలర్ ఎస్‌కె కమరుద్దీన్ మాట్లాడుతూ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ను గత నెలలో ముంబైలో టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సమక్షంలో కోర్ కమిటీ సభ్యులు ఆశిష్ షెలార్, అమోల్ కాలే, లీగ్ కమీషనర్ సూరజ్ సమత్ ప్రకటించారని తెలిపారు. ఈ క్రీడల టోర్నమెంట్ కోసం www.ispl-t10.com వెబ్ సైట్ లో ఆటగాళ్లు రిజిష్టర్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ టోర్నమెంట్ క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి, జాతీయ వేదికపై తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం కోసం ఆటగాళ్లు పై వెబ్ సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకుని సిటీ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశాన్ని పొందవలసిందిగా కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News