Tuesday, December 24, 2024

ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ లో తొలిసారి వెలుగుచూసిన మంకీపాక్స్ కేసులు

- Advertisement -
- Advertisement -

Monkeypox in Israel detected

 

టెల్అవీవ్:   ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌లు తమ మొదటి మంకీపాక్స్ కేసులను తాజాగా ధృవీకరించాయి. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన ఈ వ్యాధిని గుర్తించడంలో అనేక యూరోపియన్,  ఉత్తర అమెరికా దేశాలు చేరాయి. ఇటీవల యూకె, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ మరియు స్వీడన్‌లతో పాటు అమెరికా, కెనడా , ఆస్ట్రేలియాలో 100 కంటే ఎక్కువ మంకీపాక్స్‌కు సంబంధించిన కేసులు ధృవీకరించబడ్డం లేదా అనుమానిత కేసులు బయటపడ్డం జరిగాయి. మంకీపాక్స్  వైరస్ వ్యాపించడం ఇప్పుడు  భయాన్ని పెంచుతోంది.

ఇటీవల పశ్చిమ ఐరోపా నుండి తిరిగి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తిలో  మంకీపాక్స్ పాజిటివ్ అని తేలినట్లు టెల్ అవీవ్ లోని  ఇచిలోవ్ హాస్పిటల్ ప్రతినిధి శనివారం ఏఎఫ్ పి వార్తా సంస్థకు  తెలిపాడు. ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి విదేశాలలో కోతుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి వల్ల వ్యాధికి గురయ్యాడని,  అతను ప్రస్తుతం ఇచిలోవ్ ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నాడని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News