Sunday, December 22, 2024

గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి…. 200 మందికిపైగా మృతి

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో రెండు వందల మందికి పైగా మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గాజాలో 143 మంది, లెబనాన్ 77 మంది మరణించినట్లు సమాచారం. లెబనాన్‌లో ఇజ్రాయెల్ భూతల దాడులకు పాల్పడడంతో 33 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా ప్రాణాలు విడిచారు. నఖౌరాలోని ఏజెన్సీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో శాంతి పరిరక్షకులు గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఇరాక్ దాడి చేయడంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా భీకర దాడులు చేసి దెబ్బ కొట్టింది. ఇంకోసారి దాడి చేస్తే ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ కొడుతామని లెప్టెనెంట్ జనరల్ హెర్జి హలెవి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News