Saturday, March 22, 2025

గాజా పై దాడులు ముమ్మరం చేసిన ఇజ్రాయిల్

- Advertisement -
- Advertisement -

గాజా పై ఇజ్రాయిల్ దాడులు ముమ్మరం చేసింది, హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని రక్షించేందుకు, ఒకపక్క వైమానిక దాడులతో పాటు, సముద్ర మార్గం నుంచి, భూ మార్గం నుంచిఇజ్రాయిల్ ముప్పేట దాడికి దిగింది. పాలస్తీనా లో హమాస్ అధీనంలో ఉన్న మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.హమాస్ పై ఇజ్రాయిల్ మళ్లీ చేపట్టిన సైనిక చర్యకు అమెరికా అన్ని విధాలా మద్దతు ఇస్తోంది.హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులను వెంటనే విడుదల చేయని పక్షంలో గాజాలోని మరిన్ని పట్టణాలను ఆక్రమించుకోవాలని ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రేల్ కట్జ్ సైన్యాన్నిఆదేశించారు. అక్కడి నుంచి పాలస్తీనియన్లను ఖాళీ చేయించి ఆ ప్రాంతాలను శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు.

దాదాపు రెండు నెలల పాటు కాల్పుల విరమణ ముగియడం తో ఇజ్రాయిల్ త్రివిధ దళాలు ముమ్మరంగా చేపట్టిన ముప్పేట దాడితోకకావికలైన పాలస్తీనియన్లు ప్రాణాలు రక్షించు కొనేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. గాజా పై ఇజ్రాయిల్ మంగళవారం నాడు విమానాలద్వారా బాంబులవర్షం కురిపించడంతో 400 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు.
ఆ తర్వాత జరిగిన దాడిలో మరో 85 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ముగిసినప్పటి నుంచీ ఇప్పటివరకూ 592 మంది పాలస్తీనియన్లు మరణించారు.హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని, హమాస్ తమవద్ద బందీలుగా ఉన్న వారందరినీ స్వేచ్ఛగా విడిచి పెట్టి ఉంటే, ఇజ్రాయిల్ కాల్పుల విరమణను పొడిగించేదని, కానీ, హమాస్ అందుకు అంగీకరించకుండా వారు యుద్ధాన్నే కోరుకున్నారని అమెరికా నేషనల్ సెక్యూరిటీ సలహాదారు మైకి విల్ట్ జ్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News