Friday, January 17, 2025

కిక్కిరిసిన జనం ఉండే ప్రాంతంపై శక్తివంత బాంబులు

- Advertisement -
- Advertisement -

గాజా పౌరులు తరలివెళ్లేందుకు నిర్థిష్టంగా ఖరారు చేసిన దారులు కూడా ఇప్పుడు సురక్షితం కాకపోవడం పరిస్థితిని దిగజార్చింది. తమకు తెలిసిన సమాచారం మేరకు జనం ఆయా మార్గాల గుండా వెళ్లుతూ ఉండగానే శక్తివంతమైన బాంబుల దాడికి గురి కావల్సి వస్తోంది. ప్రజలను ఖాళీ చేయించే ఆదేశాలు వెలువరించడం, ఇదే దశలో బాంబుల దాడులు తీవ్రతరం చేయడంతో సామాన్య జనం అడుగడుక్కి గండాల నడుమ సాగాల్సి వస్తోంది. పైగా గాజాస్ట్రిప్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత గల ప్రాంతం. 362 చదరపు కిలోమీటర్ల భూభాగంలో 20 లక్షల మందికి పైగా ఉండటంతో , ఇది చీమలపుట్టనే తలపిస్తుంది. ఇటువంటి ప్రాంతంపై అత్యంత మారణాయుధాలను ప్రయోగించడం దారుణ పరిస్థితికి దారితీస్తోంది.

అంతర్జాతీయ మానవీయ చట్టాల పరిధిలో ఇటువంటి విచక్షణారహిత బాంబు దాడులపై నిషేధం విధింపు ఉంది. అయితే దీనిని తీసి గట్టున పెట్టి ఇప్పుడు దాడులు తీవ్రతరం అవుతున్నాయి. వియత్నాం యుద్ధం నాటి నుంచి ఇంతటి తీవ్రస్థాయి బాంబింగ్ తన దృష్టికి రాలేదని యుద్ధనేరాల విషయాల మాజీ విచారణాధికారి మార్క్ గార్లస్కో తెలిపారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం దశలో కూడా ఇంతటి భయానక స్థితి లేదని తెలిపారు. ఐసిస్‌పై అమెరికా అప్పట్లో తమ వద్ద ఉండే 2000 పౌండ్ బాంబును కేవలం ఒక్కసారి వాడింది అయితే ఇప్పుడు అతి తక్కువ వ్యవధిలో ఇజ్రాయెల్ సేనలు దీనిని రెండువందల సార్లు ప్రయోగించడం రక్తపాతానికి దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News