Saturday, January 18, 2025

రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

- Advertisement -
- Advertisement -

గాజాలోని దక్షణ ప్రాంతం నగరం రఫాపై ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి భీకర వైమానిక దాడులకు దిగింది. ఈ ఘటనలో నివాసిత ప్రాంతాల్లోని కనీసం తొమ్మండుగురు మృతి చెందారు. వీరిలో ఆరుగురు పిల్లలు ఉన్నారని అక్కడి ఆసుపత్రి వర్గాలు శనివారం తెలిపాయి. మృతులంతా పాలస్తీనియన్లే . గత ఏడునెలలుగా గాజాను జల్లెడ పడుతూ ఇజ్రాయెల్ దాడులకు దిగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు జరిపిన దాడులలో పౌరులు , అందులోనూ చిన్నారులు దుర్మరణం చెందడం ఆందోళనకరం అయింది.

రఫా శివార్లలోని వెస్టర్న్ టెల్ సుల్తాన్ ప్రాంతంలోని బిల్డింగ్ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దెబ్బతింది. మృతులలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అక్కడ హృదయవిదారక దృశ్యాలు కన్పించాయి. తెల్లటిదుస్తులలో ఆరుగురు పిల్లల భౌతికకాయాలను చూడగానే వారి బంధువులు రోదిస్తూ , గుండెలు బాదుకుంటూ ఉండటం కన్పించింది. మృతజీవులుగా మారిన పిల్లలను దగ్గరకు తీసుకుని , వారిని రక్షించలేకపోయామంటూ శాపనార్థాలకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News