- Advertisement -
గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుతున్నయుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. గత నెలన్నర రోజులుగా అటు ఇజ్రాయెల్.. ఇటు హమాస్ మిలిటెంట్లు పరస్పర భీకర దాడులతో విరచుకుపడడంతో వందల మంది ప్రజుల ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసాకాండను ఆపేందుకు అంతర్జాతీయ సమాజం కలుగజేసుకొని యుద్ధానికి స్వస్థి పలకాలని పిలుపునిచ్చాయి. ఈక్రమంలో పలు చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
ఇజ్రాయిల్ నుంచి 150మంది, హమాస్ నుంచి 50మంది బందీల విడుదల కోసం నాలుగు రోజులపాటు కాల్పుల విరణమకు ఒప్పుకున్నాయి. దీంతో శుక్రవారం ఇరు దేశాల నుంచి బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడుతలో హమస్ వద్ద బందీలుగా ఉన్న 250మంది ఇజ్రాయెల్ పౌరులలో 50మంది వదిలిపెట్టనుండగా.. ఇజ్రాయెల్ చెరలో ఉన్న 150 పాలస్తీనా పౌరులను విడిచిపెట్టనుంది.
- Advertisement -