Saturday, November 23, 2024

ఇజ్రాయెల్‌-హమాస్ కాల్పుల విరమణ

- Advertisement -
- Advertisement -

టెల్ అవివ్: ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మరో రెండు రోజులు విరామం లభించనుంది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు సోమవారం రాత్రితో ముగిసింది. దీంతో మరో రెండు రోజులు ఒప్పందాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇరుపక్షాల మధ్యమధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది.అయితే గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ అమలులో ఉన్న రోజులో ్లఅదనంగా 10 మంది బందీల చొప్పున హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది.

ఇజ్రాయెల్ కూడా మరో 33 మంది ఖైదీలను విడుదల చేస్తుంది. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉండగా కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొగించడంతో పాటు మరింత మంది బందీలను విడుదల చేసేలా ఇరు పక్షాలను ఒప్పించడం కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ ఈ వారం చివర్లో మరోసారి గాజాప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఇజ్రాయెల్‌హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి బ్లింకెన్ ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఇది మూడో సారి. అంతేకాకుండా గాజాలో ఇజ్రాయెల్ ఆపరేషన్ సమయంలో పౌరుల ప్రాణాలను కాపాడడంతో పాటుగా గాజాలోకి మానవతా సహాయం మరింతగా అందేలా చూడడం గురించి కూడా బ్లింకెన్ ఇజ్రాయెల్ అధికారులతో చర్చిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ఒకప్రకటనలో పేర్కొంది.

కాగా సోమవారం రాత్రి కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు హమాస్ తుది విడతగా 11 మంది మహిళలను, చిన్నారులను విడిచిపెట్టింది. ఇజ్రాయెల్ కూడా 33 మంది ఖైదీలను వదిలిపెట్టింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం కింద హమాస్ 51 మంది ఇజ్రాయెలీలతో పాటుగా 9 మంది ఇతర దేశాలకు చెందిన వారిని వదిలిపెట్టినట్లయింది. ఇజ్రాయెల్ కూడా ఇప్పటివరకు 150 మంది పాలస్తీనా ఖైదీలను వదిలిపెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News