Sunday, January 19, 2025

వైమానిక దాడులు… ఒకే కుటుంబంలో 76 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 200 మంది మృతి చెందారు. భవనంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి చెందారు. యుద్ధ మొదలైనప్పటి నుంచి ఇదే అతి తీవ్ర విషాదం అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. శరణార్థి శిబిరం వద్ద జరిగిన మరో దాడిలో 14 మంది మృతి చెందారు. గత కొంత కాలంగా హమాస్ తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ కు మధ్య యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ లో హమాస్ జరిపిన దాడిలో ఇప్పటివరకు 1140 మంది చనిపోయారు. గాజాపై ఇజ్రాయెల్ భూతల, వైమానిక దాడుల జరపడంతో 20,057 మంది మరణించినట్టు సమాచారం. మృతులలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలోకి హమాస్ చొరబడి మారణహోమం సృష్టించి 250 బందీలుగా చేసుకొని తన దేశానికి వెళ్లిపోయినప్పటి నుంచి యుద్ధం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News