Friday, December 20, 2024

యుద్ధం.. మూడు వారాల్లో 9000 మంది పాలస్తీనియన్ల బలి

- Advertisement -
- Advertisement -

రఫా ( గాజా స్ట్రిప్ ): గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి మూడు వారాలవుతుండగా, 9000 మంది కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు హతమయ్యారని హమాస్ పాలిత గాజాకు చెందిన ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. 18 ఏళ్ల లోపు వారు 3780 మందితోసహా మొత్తం 9061 మంది హత్యకు గురయ్యారని మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అష్రాఫ్ అల్‌కుద్రా వెల్లడించారు.

పాలస్తీనా లోని మొత్తం 2.3 మిలియన్ జనాభాలో సగానికి సగం మంది బాంబు దాడులకు భయపడి తిండానికి తిండి లేక, నీళ్లు, ఇంధనం లేక ఇళ్లను విడిచిపెట్టారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి హమాస్ దూసుకువెళ్లగా, ఇజ్రాయెల్ వైపు 1400 మంది హతం కాగా, ఇందులో మెజార్టీ సంఖ్యలో పౌరులే ఉన్నారు. ఇజ్రాయెల్ పదాతి దళాలు గురువారం గాజా నగరం వైపు దూసుకెళ్లాయి. అయితే హమాస్ పాలిత ప్రాంతం ముట్టడిని తగ్గించడానికి అమెరికా, అరబ్ దేశాలు దౌత్యపర ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రజలకు సాయ పడేందుకు కనీసం కొంత సమయమైనా దాడిని నిలుపు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు.

హమాస్‌తో మధ్యవర్తిత్వం జరపడానికి అమెరికా, ఈజిప్టు, ఇజ్రాయెల్, ఖతార్ మధ్య ఒప్పందం కుదిరిన తరువాత పాలస్తీనియన్లను విదేశీ పాస్‌పోర్టులతో అనుమతించాలని, అలాగే గాయపడినవారు గాజాను విడిచిపెట్టడానికి అంగీకరించాలని మానవతా దృక్పథంతో విరామం ఇవ్వాలని ముందటి రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. దానిపై గురువారం వందలాది మంది గాజాను విడిచిపెట్టారు. అమెరికాకు మిత్ర పక్షంగా ఉన్న ఇజ్రాయెల్‌తో శాంతి కోరుకుంటున్న అరబ్ దేశాలు, యుద్ధం పట్ల అసహనం వ్యక్తం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News