Sunday, January 19, 2025

యుద్ధం మళ్లీ మొదలైంది

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరువర్గాల మధ్య కుదిరిన వారం రోజుల కాల్పుల విరమణకు  కాల పరిమితి శుక్రవారం ఉదయంతో ముగిసింది. దాంతో ఒకరిపై ఒకరు మళ్లీ దాడులు ప్రారంభించారు. అయితే సంధికి కాల పరిమితి ముగియకుండానే ఇజ్రాయెల్ భూభాగంపైకి హమాస్ కాల్పులు ప్రారంభించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడిఎఫ్) ఆరోపించాయి. ఇందుకు ప్రతిగా ఐడిఎఫ్ కూడా గాజా దిశగా దాడులు ప్రారంభించింది.

మొదట్లో నాలుగు రోజుల కాల్పుల విరమణ పాటించేందుకు ఇరువర్గాల మధ్య నవంబర్ 24న సంధి కుదిరింది. దీనిని ఆ తరువాత గురువారం వరకూ పొడిగించారు. మళ్లీ మరో రెండు రోజులు పొడిగించారు. సంధికాలంలో ఇజ్రాయెల్ తన అధీనంలో బందీలుగా ఉన్న 240మంది పాలస్తీనావాసులను విడచిపెట్టగా, హమాస్ 86మంది ఇజ్రాయెల్ దేశస్థులను, 24మంది విదేశీయులను వదిలిపెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News