Friday, December 20, 2024

మానవీయ స్పందనలో పరమత భేదాలెందుకు..?

- Advertisement -
- Advertisement -

మానవీయ స్పందనలో పరతమ భేదాలెందుకు
తోటి బంగ్లాదేశీయులకు తస్లీమా సూటి ప్రశ్న
కోల్‌కతా: పాలస్తీనియన్లపై నరమేధం జరుగుతుందని స్పందించే తన దేశస్తులు ఓసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఉద్బోధించారు. సొంత దేశంలో మైనార్టీల దుస్థితి గురించి మీరు పట్టించుకోరా? అని జీవితాంతపు రెబెల్, ప్రవాస జీవితపు తస్లీమా నిలదీశారు. పాలస్తీనియన్లపై ఊచకోత జరుగుతోందని చెపుతున్నారు. అయితే వీరు సొంత దేశంలో ఏం జరుగుతుందనేది తెలిసి కూడా స్పందించడం లేదెందుకు? అని ప్రశ్నించారు.సమకాలీన సమాజంలో ఉన్న స్త్రీ విద్వేషపు మతాచారాలు, హిపోక్రసీలపై తరచూ రగిలే ఈ రచయిత్రి తాను అన్యాయం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా దీనికి వ్యతిరేకంగా తిరుగులేని పోరు సాగిస్తానని ప్రకటించారు. పిటిఐ వార్తా సంస్థకు తస్రీన్ సుదీర్ఘ ఇంటర్యూ ఇచ్చారు. ఇటీవల తన బంగ్లాదేశీ పహోదరులు పాలస్తీనియాలో దారుణాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. కొందరు తాము అక్కడికి వెళ్లి బాధితులను ఆదుకుంటామని కూడా చెపుతున్నారని తెలిసిందని చెప్పిన నస్రీన్, ఈ వైఖరి సమర్థనీయమే అన్నారు.

ఇజ్రాయెలీలపై కానీ, పాలస్తీనియన్లపై కానీ ఎవరిపై అయినా ఎక్కడైనా ఎటువంటి అక్రూత్యాలు జరిగినా గర్హనీయమే అని చెప్పారు. అయితే ఇదే దశలో తాను స్పందించే బంగ్లాదేశీయులకు ఓ సవాలువిసురుతున్నానని, వారికి నిజంగానే శరణార్థుల పట్ల బాధ ఉంటే, వారి గురించి ఆందోళన చెందితే బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ పలువురిపై దాడులు జరుగుతూ అనేక మంది పలు దిక్కులకు శరణార్థులుగా వెళ్లుతున్నారని చెప్పారు. అక్కడ శరణార్థులు అవుతున్న వారికోసం స్పందించే వీరు ఇక్కడ బాధితులు అవుతున్న దేశీయులు పట్ల ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. న్యాయం కోసం స్పందన అంతటా ఒకే స్థాయిలో ఉండాలి. తమ వరకు వచ్చేసరికి ఓ న్యాయం ఇతరులను తిట్టే దశలో మరో న్యాయమా? అని ఈ రచయిత్రి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News