Friday, December 20, 2024

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం..40 వేలు దాటిన మరణాలు

- Advertisement -
- Advertisement -

గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా మరణాల సంఖ్య 40 వేలు దాటినట్టు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుండటంతో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన సంఘటన తీవ్రంగా కలచివేస్తోంది. పుట్టిన నాలుగు రోజులకే కవల పిల్లలను ఓ తండ్రి కోల్పోయాడు. చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ తీసుకురాడానికి వెళ్లిన అతడు , తిరిగి తన ఆశ్రయ శిబిరానికి వచ్చే సరికి కవల పిల్లలతోపాటు భార్య కూడా ఇజ్రాయెల్ దాడులకు బలైపోయారు. ఈ విధంగా దాడుల్లో ప్రాణాలను కోల్పోయిన చిన్నారులను చేతుల్లో పట్టుకొని తల్లిదండ్రులు మోసుకెళ్తున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News