Friday, December 20, 2024

అది ఆస్పత్రే కాదు.. హమాస్ ప్రధాన కార్యాలయం

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : హమాస్ నెట్‌వర్క్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులకు పాల్పడుతోంది. పూర్తిస్థాయి భూతల దాడులకు సన్నాహకంగా కొన్ని రోజులుగా గాజాలోని లక్షిత ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం కీలక విషయం వెల్లడించింది. గాజాలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన అల్- షిఫా కేవలం హాస్పిటల్ మాత్రమే కాదని, అది హమాస్ ఉగ్ర కార్యకలాపాలకు ప్రధాన కార్యాలయంగా కూడా ఉందని ఆరోపించింది. దీనికి సంబంధించి నిఘావర్గాల ఆధారిత ఓ యానిమేటెడ్ వీడియోను ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ఆసుపత్రి భవనం కింద భూగర్భంలో ఓ నివాసం ఉన్నట్లు వీడియోలో చూపించింది. గాజాలోని రహస్య ఉగ్రవాద స్థావరాలను బట్టబయలు చేస్తామని ఐడీఎఫ్ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News