Monday, January 20, 2025

పీఐజే రెండో టాప్ కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

Israel killed second top commander of PIJ

జెరూసలెం: గాజాపట్టీపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ (పీఐజే) గ్రూపుకు చెందిన మిలిటెంట్ నాయకులను లక్షంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 28 మంది మరణించినట్టు సమాచారం. వీరిలో పీఐజే నాయకులు ఖలీద్ మన్సార్, తైసీర్ జబారీ ఉన్నారు. మరో ఆరుగురు చిన్నారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నుంచి 400కు పైగా రాకెట్లు, మోర్టార్ షెల్స్‌ను ఇజ్రాయెల్ పైకి గాజా నుంచి ప్రయోగించారు. పీఐజే నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉండటంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. వారం రోజులకు పైగా ఈ దాడులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జరిగిన ఆపరేషన్‌లో రఫా లోని పీఐజే సీనియర్ నాయకుడు ఖలీద్ మన్సూర్ ఇంటిని ధ్వంసం చేశారు. గతంలో ఖలీద్‌ను మట్టు బెట్టేందకు ఇజ్రాయెల్ దళాలు దాదాపు ఐదు సార్లు ప్రయత్నించగా తప్పించుకొన్నాడు. గాజాలో మిలిటెంట్ ఆపరేషన్లకు ఇతడే బాధ్యుడని భావిస్తున్నారు. తాజా దాడిలో అతడిని ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఇక వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దళాలు వేర్వేరు దాడులు నిర్వహించి 19 మంది పీఐజే సభ్యులను అదుపు లోకి తీసుకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News