Saturday, January 18, 2025

రఫాలో భీకర పోరు

- Advertisement -
- Advertisement -

రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల మధ్య భీకర పోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీ స్థాయిలోనే యుద్ధవిమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తూర్పు , పశ్చిమ రఫాలను విడదీసే రహదారిపై ఇజ్రాయెల్ తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. హమాస్ కూడా ఐడీఎఫ్ దళాలపై భారీ స్థాయిలో రాకెట్లను ప్రయోగిస్తోంది. దీంతో రఫాలో తలదాచుకుంటున్న 14 లక్షలకు పైగా పాలస్తీనియన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే లక్షా పదివేల మంది రఫాను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.

అయితే ప్రస్తుతం గాజాలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని ఐక్యరాజ్యసమితి సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. కీలక రఫా క్రాసింగ్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించడంతో ఈజిప్టు నుంచి రావాల్సిన మానవతా సాయం ఆగిపోయింది. తూర్పు రఫా లోనే హమాస్‌కు సంబంధించి నాలుగు బెటాలియన్లతోపాటు , ఆ సంస్థ కీలక నేతలూ ఉన్నారని టెల్‌అవీవ్ బలంగా నమ్ముతోంది. మరోవైపు తూర్పు గాజా లోనూ ఇజ్రాయెల్ హమాస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తాజా పరిస్థితులపై రెడ్‌క్రాస్ ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News