Thursday, January 23, 2025

ఇజ్రాయెల్‌ లో ఉద్రిక్తత పరిస్థితులు.. ఆపరేషన్ అజయ్ చేపట్టిన భారత్

- Advertisement -
- Advertisement -

గాజాలో నలుగురు భారతీయులు చిక్కుకున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు దాదాపు 150 మంది ఇజ్రాయెలీలను గాజాలో బందీలుగా చేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై భీకర దాడులు చేస్తోంది. అటు హమాస్ ఉగ్రవాదుల దాడులతో ఇజ్రాయెల్‌ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులను వెనక్కి రప్పించే అంశంపై గురువారం విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాజాలో నలుగురు భారతీయులు చిక్కుకున్నారని తెలిపారు. ఇజ్రాయెల్‌ లో భారతీయులు చనిపోయినట్లు సమాచారం లేదన్నారు. ఆపరేషన్ అజయ్ లో భాగంగా రేపు(శుక్రవారం) 230 మంది భారతీయులను ఇజ్రాయెల్‌ నుంచి వెనక్కి తరలిస్తున్నామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News