Monday, December 23, 2024

‘హమాస్‌’ నాశనం అయ్యేవరకు యుద్ధాన్ని ఆపేదిలేదు: పుతిన్‌తో నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్: హమాస్ మిలిటెంట్ నెట్‌వర్క్ లక్షంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో హమాస్‌ను నాశనం చేసేంతవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. రష్యా అధినేత పుతిన్‌కు స్పష్టం చేశారు. ఇరువురు నేతలు ఫోన్‌కాల్‌లో సంభాషించుకున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇజ్రాయెల్‌పై క్రూరమైన హంతకులు దాడి చేశారు. ఈ నేపథ్యం లోనే దృఢ నిశ్చయంతో , ఐక్యంగా హమాస్‌పై యుద్ధానికి వెళ్లాం. హమాస్ సైనిక, పాలనాపర సామర్ధాలను నాశనం చేసేవరకు ఇది ఆగదు” అని పుతిన్‌కు నెతన్యాహు స్పష్టం చేశారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం పుతిన్ చైనాలో పర్యటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News